ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్‌.. ఇకపై ఇంటికే బీఎల్ఓలు!

BLOs visit

BLOs visit

BLOs visit: కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారుల మధ్య ఇటీవల కొన్ని విభేదాలు నెలకున్నాయనే వార్తల నేపథ్యంలో ఈసీ ఉన్నతాధికారులు అత్యవసరంగా సమావేశమయ్యారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌తో పాటు ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, డాక్టర్ వివేక్ జోషి ఈ భేటీలో పాల్గొన్నారు. కమిషన్ పరిధిలోని అంతర్గత అంశాలు, కమిషనర్ల మధ్య వచ్చిన అభిప్రాయ భేదాలపై సుదీర్ఘంగా చర్చించారు.

ఓటర్లకు పెద్ద ఊరట!
మరొకవైపు ఓటర్ల జాబితా సవరణ, ఎస్ఐఆర్ ప్రక్రియపై సాధారణ ప్రజలకు, ఓటర్లకు ఉపశమనం కలిగించేలా కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఎస్ఐఆర్ నోటీసులు అందుకున్న ఓటర్లు తమ వివరాలు, ధృవీకరణ పత్రాలు సమర్పించేందుకు బిఎల్ఓ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని ఈసీ స్పష్టం చేసింది. నోటీసులు పొందిన వారి ఇళ్లకు బిఎల్ఓలు నేరుగా వెళ్తారు. అక్కడే అవసరమైన డాక్యుమెంట్లు, ఆధారాలు సేకరించి, తమ ఆధ్వర్యంలోనే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తారని ఎన్నికల సంఘం తేల్చిచెప్పింది.