భక్తుల ఇలవేల్పు, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ. ఆ అమ్మవారికి సంబంధించిన ఒక అరుదైన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ఫోటో 1990వ సంవత్సరం నాటిదని నెటిజన్లు పేర్కొంటున్నారు.
దాదాపు మూడు దశాబ్దాల క్రితం అమ్మవారి మూలవిరాట్ అలంకరణ, రూపం ఎలా ఉండేదో ఈ చిత్రంలో స్పష్టంగా కనిపిస్తోంది. సాంకేతికత ఇంతగా లేని ఆ రోజుల్లో తీసిన ఈ అపురూప దృశ్యం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. “బెజవాడ కనకదుర్గమ్మ అరుదైన ఫోటో” అంటూ సామాజిక మాధ్యమాల్లో షేర్లు, లైకులతో దుర్గమ్మ భక్తులు ఈ ఫోటోను ట్రెండ్ చేస్తున్నారు. అమ్మవారి రూపాన్ని చూసి తరిస్తూ, కామెంట్ల రూపంలో జై దుర్గా భవానీ అంటూ భక్తిభావం చాటుకుంటున్నారు.
