అయోధ్య రామాలయ విరాళాల చోరీ కేసులో అరెస్ట్ అయిన 8 మంది నిందితుల లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ భారీ స్కామ్‌పై ఆదాయపన్ను శాఖ (IT), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కూడా నజర్ పెట్టాయి.
ప్రధాన నిందితుల వివరాలు ఇలా ఉన్నాయి. చోరీ సొమ్ముతో లవ్ కుశ్, అనుకల్ప్ మిశ్రా అరడజనకు పైగా ఆస్తులు కొన్నారు. నెలకు ₹12 వేల జీతం తీసుకునే లవ్ కుశ్.. భార్య పేరిట ₹25 లక్షల ఇల్లు కట్టడమే కాకుండా, ఆవుపేడ కింద ₹12 లక్షలు దాచాడు. ఇక అవినాశ్ శుక్లా నుంచి పోలీసులు అత్యధికంగా ₹94 లక్షల నగదు రికవరీ చేశారు. మనీశ్, రాంశంకర్ యాదవ్‌ల నుంచి రూ.36 లక్షల నగదు, నగలు, ల్యాండ్ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.
బ్యాంకు ఉద్యోగుల హస్తం?
టెంపుల్ విరాళాలను లెక్కించే SBI కౌంటింగ్ రూమ్‌లోకి యాక్సెస్ సంపాదించి నిందితులు ఈ చోరీకి పాల్పడ్డారు. దీంతో ఈ విరాళాల లెక్కింపు బృందంలోని కొందరు బ్యాంకు ఉద్యోగులను కూడా పోలీసులు విచారిస్తున్నారు. నిందితులందరి ఖాతాల్లో ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతానికి దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.
