C.K. Nayudu: భారత క్రికెట్ ఓజీ(OG).. మన సీకే నాయుడు!

ck-nayudu-indian-cricket-first-captain-gen-z-special

క్రికెట్ అంటే మీకేం గుర్తొస్తుంది? భారీ సిక్సర్లు, గాల్లో ఎగిరే వికెట్లు, కింగ్ కోహ్లీ అగ్రెషన్ కదూ? కానీ వీటన్నింటికీ వందేళ్ల ముందే ఇండియన్ క్రికెట్‌కు ఒక రేంజ్ ‘హైప్’, ‘స్టైల్’ తీసుకొచ్చిన ఒక గ్రేట్ లెజెండ్ ఉన్నారు. ఆయనే కొఠారి కనకయ్య నాయుడు (C.K. Nayudu). భారత తొలి టెస్ట్ కెప్టెన్! తెలుగువాడైన ఈ క్రికెట్ సూపర్ స్టార్ గురించి ఈ తరం కచ్చితంగా తెలుసుకోవాలి.

1. ఆటిట్యూడ్‌లో ఆయనే ‘ఫస్ట్’
1932లో భారత్ తొలిసారి లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్‌తో తన మొదటి అధికారిక టెస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు టీమ్‌ను లీడ్ చేసింది సీకే నాయుడే. తెల్లదొరలు క్రికెట్‌ను శాసిస్తున్న రోజుల్లో, వాళ్ల హోమ్ గ్రౌండ్‌లోనే కళ్లు చెదిరే సిక్సర్లతో భయపెట్టారు. అప్పట్లోనే ఆయన ఆరు అడుగుల పొడవుతో, అల్టిమేట్ ఫిట్‌నెస్‌తో గ్రౌండ్‌లోకి దిగితే అపోజిషన్ టీమ్‌కు ‘వణుకు’ పుట్టేది.

2. ది ఒరిజినల్ ‘సిక్సర్ కింగ్’.. ఒకే షాట్‌తో స్టేట్ బోర్డర్ దాటించిన ఘనత!
ఈ రోజుల్లో రోహిత్ శర్మ సిక్సర్లు కొడితే మనం వావ్ అంటున్నాం. కానీ సీకే నాయుడు గాల్లోకి లేపితే బంతి మైదానం దాటాల్సిందే. క్రికెట్ చరిత్ర పుస్తకాల్లో నమోదైన ఆయన కొన్ని మైండ్ బ్లోయింగ్ సిక్సర్ల గురించి వింటే జెన్ జీల మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

ఒకే షాట్‌తో రెండు రాష్ట్రాలు: 1923లో ఇండోర్‌లోని యశ్వంత్ క్లబ్ గ్రౌండ్‌లో మ్యాచ్ జరుగుతున్నప్పుడు.. సీకే నాయుడు కొట్టిన ఒక భారీ షాట్ మైదానాన్ని, పక్కనే ఉన్న ‘ఖాన్’ నదిని దాటేసి అవతలి ఒడ్డున పడింది. అప్పట్లో నదికి ఇటువైపు బ్రిటిష్ ఇండియా ఉంటే, అటువైపు హోల్కర్ సంస్థానం (స్టేట్) ఉండేది. అంటే ఆయన కొట్టిన సిక్సర్ ఒకేసారి నదిని, అప్పటి బోర్డర్లను దాటేసిందన్నమాట! ఈ అద్భుతానికి గుర్తుగా ఆ హోల్కర్ మహారాజు బంతి పడిన చోట ఒక స్మారక స్తంభాన్ని కూడా కట్టించారు.

కౌంటీ సరిహద్దులు దాటిన సిక్స్: 1932లో ఇంగ్లాండ్ టూర్‌లో ఎడ్జ్‌బాస్టన్ గ్రౌండ్‌లో జరిగిన ఒక మ్యాచ్‌లో ఆయన కొట్టిన సిక్స్ స్టేడియం దాటి, పక్కనే ఉన్న ‘రివర్ రియా’ (River Rea) అవతల పడింది. అప్పట్లో కౌంటీ సరిహద్దుల లెక్కల ప్రకారం.. ఆయన కొట్టిన షాట్ వార్విక్‌షైర్ (Warwickshire) నుండి వోర్సెస్టర్‌షైర్ (Worcestershire) కౌంటీలోకి వెళ్లి పడిందని లండన్ జనం ఇప్పటికీ కథలుగా చెప్పుకుంటారు!

కిలోమీటర్ దూరం వెళ్లిన బంతి? :1926లో బాంబే జింఖానా గ్రౌండ్‌లో ఆయన కొట్టిన మరో సిక్స్ ఏకంగా ఆజాద్ మైదాన్ దాటి, దాదాపు ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రసిద్ధ ‘రాజాబాయి క్లాక్ టవర్’ రూఫ్ (పైకప్పు) పై పడిందని ముంబై క్రికెట్ చరిత్రలో ఒక బలమైన టాక్ ఉంది.

చెపాక్ గోడలు బద్దలు: డిసెంబర్ 1920లో మద్రాస్ (చెన్నై) లో యూరోపియన్లతో జరిగిన మ్యాచ్‌లో 120 రన్స్ బాదిన సీకే నాయుడు.. ప్రసిద్ధ చెపాక్ స్టేడియం కాంపౌండ్ వాల్స్ దాటించి, గ్రౌండ్ వెలుపల దాదాపు 50 గజాల (46 మీటర్ల) దూరంలో బంతిని విసిరారు.

3. ఏజ్ జస్ట్ ఎ నంబర్!
Gen Z భాషలో చెప్పాలంటే ఆయనో ‘అల్టిమేట్ గిగాచాడ్’ (Gigachad). 68 ఏళ్ల వయసులో కూడా ఆయన ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడారంటే నమ్ముతారా? పిచ్‌పై యువకులతో పోటీపడుతూ సిక్సర్లు బాదారు. ఆయన ఫిట్‌నెస్ లెవెల్స్ చూసి అప్పటి తరం నోరెళ్లబెట్టింది.

భారత ప్రభుత్వం నుంచి ‘పద్మభూషణ్’ అందుకున్న తొలి క్రికెటర్ సీకే నాయుడు. ఈ రోజు మనం చూస్తున్న గంగూలీ కటౌట్, ధోనీ కూల్‌నెస్, కోహ్లీ అగ్రెషన్.. వీటన్నింటికీ ‘ఓజీ’ (OG) మన సీకే నాయుడే! క్రికెట్ హిస్టరీలో ఆయన పేరు ఎప్పటికీ ఒక బ్రాండ్.