కాన్వాయ్ లేదు.. హంగామా లేదు.. చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ ‘సింగిల్’ ఎంట్రీ వెనుక అసలు వ్యూహం ఇదేనా?

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఊహించని, కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వేగవంతమవుతున్న వేళ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలాంటి హంగామా, ప్రొటోకాల్ సెక్యూరిటీ మరియు వాహనాల కాన్వాయ్ లేకుండా నేరుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లడం తీవ్ర కలకలం రేపింది. ఉండవల్లిలోని సీఎం నివాసంలో జరిగిన ఈ అత్యవసర భేటీ రాజధాని వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వ్యూహాలపై ఇద్దరు అగ్రనేతలు ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. స్థానిక పోరుకు సంబంధించి సుప్రీంకోర్టు వెలువరించిన ఇటీవల తీర్పులు, ఎన్నికల నిర్వహణ లేదా వాయిదా పడే అవకాశాలపై ఇద్దరూ సుదీర్ఘంగా ఆలోచనలు పంచుకున్నారని తెలుస్తోంది.

గతంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అనేకసార్లు సమావేశమైనప్పటికీ.. ఈసారి పవన్ కళ్యాణ్ పూర్తి భద్రతా సిబ్బందిని, కాన్వాయ్‌ని పక్కనపెట్టి ఒంటరిగా (సింగిల్‌గా) ప్రయాణించి సీఎం నివాసానికి చేరుకోవడం వెనుక ఉన్న వ్యూహంపై పొలిటికల్ సర్కిళ్లలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. కూటమి భవిష్యత్ ప్రణాళికలు, క్షేత్రస్థాయి సమన్వయంపై ఈ కీలక సమావేశంలో స్పష్టమైన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.