డిజిటల్ మాయాజాలం: క్లిక్ చేస్తే.. జేబు ఖాళీ!

Cyber Crime

Cyber Crime

Cyber Crime: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకూ మన జీవనశైలిని సులభతరం చేస్తున్నప్పటికీ, అదే సాంకేతికతను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్నారు. అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే ఒక చిన్న మెసేజ్ లింక్ క్లిక్ చేసినా, వాట్సాప్‌లో వచ్చిన సందేశానికి ‘యస్’ లేదా ‘నో’ అని బదులిచ్చినా, రోడ్డుపై ‘అయ్యో పాపం’ అని అత్యవసరం పేరిట అడిగిన వారికి ఫోన్ ఇచ్చినా.. క్షణాల్లో మీ బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయిపోతున్నాయి.

సైబర్ నేరగాళ్లు ప్రజల భయం, ఆశ, మానవత్వాన్ని పెట్టుబడిగా మార్చుకుని నిత్యం కోట్ల రూపాయల సొమ్మును కొల్లగొడుతున్నారు. డిజిటల్ అరెస్ట్, పార్ట్ టైమ్ ఉద్యోగాలు, కేవైసీ అప్‌డేట్, లాటరీ పేరుతో నిత్యం ఎందరో అమాయకులు వీరి ఉచ్చులో పడుతున్నారు. గతంలో ఎయిడ్స్ వ్యాధి నివారణ కోసం ప్రభుత్వం, సామాజిక సంస్థలు ఏ స్థాయిలో విస్తృత ప్రచారాన్ని, అవగాహన కార్యక్రమాలను నిర్వహించాయో.. నేడు సైబర్ నేరాల నివారణకు అంతకుమించిన స్థాయిలో చైతన్యాన్ని రగిలించాల్సిన అత్యవసర పరిస్థితి దాపురించింది.

సైబర్ నేరాలను పూర్తిగా అంతం చేయడం అసాధ్యమైనప్పటికీ, ముందస్తు జాగ్రత్తలు, అవగాహన ద్వారా వాటిని సమర్థవంతంగా నివారించవచ్చు. ప్రతి ఒక్కరిలో అవగాహన పెరగడమే ఈ ముఠాల బారిన పడకుండా ఉండటానికి ఉన్న ఏకైక ఏకైక రక్షణ మార్గం. తెలియని నంబర్ల నుంచి వచ్చే లింకులను ఓపెన్ చేయకపోవడం, బ్యాంక్ ఓటీపీలు లేదా వ్యక్తిగత వివరాలను ఎవరికీ పంచుకోకపోవడం, తెలియని వారికి ఫోన్ ఇవ్వకపోవడం వంటి ప్రాథమిక సూత్రాలను తప్పనిసరిగా పాటించాలి. ఒకవేళ పొరపాటున మోసపోతే వెంటనే ‘1930’ సైబర్ హెల్ప్‌లైన్ నంబర్‌కు లేదా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిపుణులు విజ్ఞప్తి చేస్తున్నారు.