Bolo Ganapathi: ‘’ఆయ్’, ‘సేవ్ ది టైగర్స్’ ఫేమ్ ప్రముఖ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ వినాయక చవితి సందర్భంగా ‘బోలో గణపతి S/O ఉమాపతి’ పేరుతో ప్రత్యేక సింగిల్‌ను విడుదల చేశారు. ఈ పాటకు అజయ్ స్వరాలు సమకూర్చడమే కాకుండా, తన సొంత మ్యూజిక్ లేబుల్ ‘AjA Records’ పై స్వయంగా నిర్మించారు.
ఈ గీతాన్ని జయరామ్ పైలా, సింధూర రాజేష్ ఎనర్జిటిక్‌గా గానం చేయగా, భాస్కర్ తిరుమల ట్రెండీ సాహిత్యాన్ని అందించారు. భక్తి, ఆధునిక సంగీత శైలులను మేళవిస్తూ రెండు రోజుల్లోనే ఈ పాటను కంపోజ్ చేశారు. తెలుగు, సంస్కృతం, ఇంగ్లీష్ పదాల కలయికతో రూపొందిన ఈ పాట జెన్ జీ యూత్‌తో పాటు పెద్దలను కూడా ఆకట్టుకునేలా ఉంది.
లిరికల్ వీడియోలో పాట కంపోజిషన్‌తో పాటు గణేష్ మహారాజ్ పెయింటింగ్ ఫ్రేమ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇటీవలే అజయ్ అరసాడను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందించడం విశేషం. ఉత్సాహభరితమైన బీట్తో సాగే ఈ స్పెషల్ సింగిల్ గణేష్ ఉత్సవాల్లో ప్రత్యేక వైబ్‌ను తీసుకొస్తోంది.
