మెగాస్టార్ చిరంజీవి ‘కాకా’ టైటిల్ గ్లింప్స్: నేటి తరం కోరుకున్న వింటేజ్ మాస్ అవతార్!
మినిట్ 2 మినిట్ , మూవీ న్యూస్ : మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు (ఆగస్ట్ 22) సందర్భంగా అభిమానులకు అద్భుతమైన కానుక లభించింది. బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం (#Mega158) టైటిల్‌ను ‘కాకా’ (KAAKA) గా ప్రకటిస్తూ మేకర్స్ అదిరిపోయే గ్లింప్స్‌ను విడుదల చేశారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ K నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఆక్వా పరిశ్రమలో ‘సత్యం’గా కనిపిస్తూనే, నీటి అడుగున అయస్కాంతంతో ఆయుధాలను బయటకు తీసే షాట్‌తో దర్శకుడు మాస్ ఆరాను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారు. శమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, వింటేజ్ ‘చికు చికు చిలం’ రీమిక్స్ మ్యూజిక్ గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి.
కేవలం రొటీన్ మాస్ మాత్రమే కాకుండా, నేటి తరం అభిమానులు మెగాస్టార్ నుంచి ఏ స్వాగ్, ఇంటెన్స్ యాక్షన్, సరికొత్త క్యారెక్టరైజేషన్ ఆశిస్తున్నారో.. అవన్నీ ‘కాకా’ గ్లింప్స్‌లో పుష్కలంగా కనిపించాయి. ఈ చిత్రం 2027 సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
