Tirupati elections: తిరుపతి జిల్లా చిగురువాడ గ్రామం నుంచి స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న సుభద్ర వినూత్న రీతిలో తన నామినేషన్ను దాఖలు చేశారు. ఎన్నికల డిపాజిట్ కోసం ఆమె ఏకంగా రూపాయి నాణేలను తీసుకొని రిటర్నింగ్ అధికారి ముందుకు రావడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
గ్రామస్థుల చందాలతో రూ.6 వేల నాణేల సేకరణ – సమస్యలపై నిరసనగా పోటీ:
తమ గ్రామ సమస్యలను అధికారులు గానీ, ఎవరూ పట్టించుకోవడం లేదనే తీవ్ర నిరసనతో తనను నామినేషన్ వేయాలని గ్రామస్థులే స్వయంగా ప్రోత్సహించారని సుభద్ర వెల్లడించారు. గ్రామస్థులందరూ తలా రూపాయి చొప్పున చందాలు వేసి ఇవ్వగా, అలా సేకరించిన సుమారు రూ.6 వేల విలువైన రూపాయి నాణేలతో ఆమె నామినేషన్ పత్రాలను సమర్పించారు.
