‘అసలు’ గొంతు ఎవరో.. ‘నకిలీ’ గొంతు ఎవరో.. ఒక్క ఫోన్ కాల్‌తో వేల కోట్లు కొల్లగొట్టిన ఏఐ స్కామ్!

AI scam

AI scam

AI scam:  టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు సరికొత్త దోపిడీ మార్గాలను ఎంచుకుంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను ఆసరాగా చేసుకుని ఏకంగా వేల కోట్ల రూపాయలను నొక్కేస్తున్న ఘరానా మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటలీలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకు ‘ఇంటెసా శాన్‌పాలో’ అనుబంధ సంస్థలో జరిగిన భారీ ఏఐ స్కామ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

వాయిస్ క్లోనింగ్‌తో రూ. 1034 కోట్లు కాజేసిన కేటుగాళ్లు! ఇటలీకి చెందిన ఈ బ్యాంకు సంస్థ మాజీ ఛైర్మన్ పావాలో మోలెసినిని కేటుగాళ్లు బురిడీ కొట్టించారు. సంస్థ సీఈఓ కార్లో మెస్సీనాలా హావభావాలు, గొంతును ఉన్నది ఉన్నట్లుగా ఏఐ వాయిస్ క్లోనింగ్ టెక్నాలజీతో సృష్టించారు. నిజంగానే సీఈఓ కాల్ చేశారనుకున్న మాజీ ఛైర్మన్.. విదేశీ ఖాతాల్లో ఉన్న రూ. 1034 కోట్లను ఇతర ఖాతాలకు బదిలీ చేయాలని తన ఫైనాన్స్ విభాగాన్ని ఆదేశించారు. అనుమానాస్పద లావాదేవీలను పసిగట్టిన అధికారులు తక్షణమే స్పందించి రూ. 570 కోట్లను రికవరీ చేయగలిగినా, మిగతా మొత్తం క్రిప్టోకరెన్సీగా మారిపోవడంతో నేరగాళ్ల ఖాతాల్లోకి వెళ్లిపోయింది.

ఏఐ మోసాలు అంటే ఏమిటి? ప్రజలు ఎలా జాగ్రత్త పడాలి? మనకి తెలిసిన వ్యక్తులు, స్నేహితులు లేదా ఆఫీస్ అధికారుల మాట్లాడినట్లే హుबेహుగా గొంతును మార్చి మాట్లాడే పరిజ్ఞానమే ఏఐ వాయిస్ క్లోనింగ్. అత్యవసర పరిస్థితి ఉందనో, ప్రమాదంలో ఉన్నామనో కాల్స్ చేసి డబ్బులు అడుగుతుంటారు.

వెంటనే నమ్మవద్దు: పరిచయస్తుల గొంతుతో ఫోన్ వచ్చి అత్యవసరంగా డబ్బులు పంపాలని కోరితే తొందరపడి డబ్బులు పంపకండి.

మరోసారి కాల్ చేయండి: ఫోన్ కట్ చేసి, సదరు వ్యక్తికి చెందిన నిజమైన నంబర్‌కు స్వయంగా కాల్ చేసి నిజానిజాలు సరిచూసుకోండి.

రహస్య వివరాలు ఇవ్వొద్దు: అపరిచిత వ్యక్తులకు ఓటీపీ, బ్యాంక్ వివరాలు, పాస్‌వర్డ్‌లు అస్సలు పంచుకోకండి.