కొత్త ఓటర్లకు అలర్ట్.. ఫారమ్-6పై సీఈవో సుదర్శన్ రెడ్డి కీలక ప్రకటన!

SIR Process

SIR Process

SIR Process: తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సి. సుదర్శన్ రెడ్డి కీలకమైన ప్రకటన చేశారు. ఫారమ్-6 అదనపు డిక్లరేషన్ తొలగింపు మినహాయింపు కేవలం ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తిగా పూర్తయిన రాష్ట్రాలకు మాత్రమే వర్తిస్తుందని, తెలంగాణలో ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతుండటంతో కొత్త ఓటర్లు ఫారమ్-6కు డిక్లరేషన్ తప్పనిసరిగా సమర్పించాల్సిందేనని స్పష్టం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ఇప్పటివరకు 92 లక్షల మందికి నోటీసులు అందజేశామని సీఈవో వెల్లడించారు. వీరిలో 65 లక్షల మంది ఇప్పటికే తమ సమాధానాలు, పత్రాలను సమర్పించగా, వారిలో 54 లక్షల మంది ఓటర్లను తుది జాబితాలోకి చేర్చినట్లు తెలిపారు. నవంబర్ 5వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని, మిగిలిన వారి దరఖాస్తులను కూడా పరిశీలించి హিয়రింగ్ ద్వారా తుది జాబితాలోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇకపై నోటీసులు పొందిన ప్రతీ ఇంటీకీ బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓ) స్వయంగా వెళ్లి పత్రాలు సేకరిస్తారని, ఒక్కో ఓటరును ప్రత్యేకంగా పిలిపించే అవసరం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఇదే సమయంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ గడువును మరోసారి పెంచే ప్రసక్తే లేదని సీఈవో స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఐదుసార్లు గడువు పొడిగించామని, ఇక పొడిగింపు ఉండదని తేల్చి చెప్పారు. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం క్లెయిమ్‌లు, అభ్యంతరాల సమర్పణకు ఈ నెల 7వ తేదీ వరకు గడువు ఉండగా, నోటీసుల జారీ, అభ్యంతరాల పరిష్కారానికి నవంబర్ 5 వరకు సమయం ఉందన్నారు. అన్ని ప్రక్రియలు పూర్తి చేసి నవంబర్ 9న తుది ఓటరు జాబితాను అధికారికంగా ప్రచురిస్తామని స్పష్టం చేశారు.