తెలుగు విశ్వవిద్యాలయం పరిరక్షణకు రిలే నిరాహార దీక్షలు

telugu-university-relay-hunger-strike-nampally

హైదరాబాద్‌:  నగరంలోని సురవరం ప్రతాప రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నాంపల్లి క్యాంపస్‌ను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ ‘తెలుగు విశ్వవిద్యాలయం పరిరక్షణ సమితి’ ఆధ్వర్యంలో శుక్రవారం రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. నాంపల్లి క్యాంపస్ ప్రాంగణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద జరిగిన ఈ దీక్షల్లో విద్యార్థులు, అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు మరియు భాషాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సుమారు 2,500 మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, విశ్వవిద్యాలయాన్ని ప్రైవేట్ వ్యక్తుల ప్రభావం నుండి విముక్తి చేయాలని, నాంపల్లిలోనే కొనసాగించి అభివృద్ధి చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాచుపల్లి, వరంగల్ క్యాంపస్‌ల సిబ్బంది, విద్యార్థులు కూడా ఈ ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు.