“దేవుడి మీద ఒట్టు.. ఆ ఇల్లు నాదే..” జగన్‌పై షర్మిల సంచలన ట్వీట్!

Sharmila Jagan

Sharmila Jagan

Sharmila Jagan: వైఎస్సార్ కుటుంబంలో ఆస్తుల వివాదం మరోసారి తీవ్ర రూపం దాల్చింది. తన సోదరుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ట్యాగ్ చేస్తూ వైఎస్ షర్మిల సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా చేసిన సంచలన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తనది కాని ఆస్తి కోసం ఆశపడే నీచ మనస్తత్వం తనది కాదని ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

బెంగళూరులోని యలహంక ప్రాపర్టీ 2018 వరకు ఉమ్మడి ఆస్తిగా ఉండేదని, ఆ తర్వాత జరిగిన కుటుంబ ఆస్తుల పెంపకాల్లో అది పూర్తిగా తనకు, తన పిల్లల భాగానికి వచ్చిందని షర్మిల స్పష్టం చేశారు. దేవుడి సాక్షిగా ఇది పచ్చి నిజమని, తన బిడ్డల హక్కు అని తేల్చి చెప్పారు. తండ్రి వైఎస్సార్ తిరిగిన ఇల్లు కావడంతో, తన కుమార్తె అంజలి కోరిక మేరకు ఆమె వివాహాన్ని ఆ నివాసంలోనే జరిపించాలని భావించినట్లు తెలిపారు. తాను పెరిగిన ఇల్లే పెళ్లి వేదిక కావాలన్న బిడ్డ ఆకాంక్షను నెరవేర్చలేకపోతున్నందుకు ఎంతో బాధపడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే ఎలాంటి వివాదాలు, గొడవలు లేకుండా వేడుకను ప్రశాంతంగా జరిపించాల్సిన బాధ్యత తల్లిగా తనపై ఉందన్నారు. అందుకే ఎలాంటి రచ్చకు తావివ్వకుండా పరిణయ వేడుకను వేరే ప్రాంతంలో బంధుమితులు, ఆత్మీయుల సమక్షంలో ఘనంగా నిర్వహించాలని నిశ్చయించుకున్నట్లు వైఎస్ షర్మిల వెల్లడించారు.