Diesel Prices: డీజిల్ ధరల పెంపుపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయని తెలిపారు. కొన్ని వారాల వ్యవధిలోనే బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 70 డాలర్ల నుంచి 122 డాలర్లకు చేరుకుందని పేర్కొన్నారు.
ఈ పరిస్థితుల్లో లీటర్ డీజిల్పై కనీసం రూ.50 పెంచాల్సిన అవసరం ఏర్పడిందని మోదీ వెల్లడించారు. అయితే పెరిగిన భారాన్ని పూర్తిగా ప్రజలపై వేయకూడదనే ఉద్దేశంతో కేవలం రూ.7 మాత్రమే పెంచినట్లు తెలిపారు. మిగిలిన రూ.43 భారాన్ని ప్రభుత్వమే భరిస్తోందని పేర్కొన్నారు.
ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వంపై ప్రతి నెలా సుమారు రూ.14 వేల కోట్ల ఆర్థిక భారం పడుతోందని ఓ సమావేశంలో ప్రధాని వివరించారు. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినప్పటికీ ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన వ్యాఖ్యానించారు.
