ప్రాణాలు కాపాడిన రియల్ హీరో.. కెప్టెన్ నుదుటిపై ముద్దుపెట్టిన దుబాయ్ ప్రిన్స్!

Captain Smith

Captain Smith

Captain Smith: సాహసోపేత నిర్ణయంతో వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన ‘ఫ్లైదుబాయ్’ విమాన కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇటీవల జరిగిన విమాన ప్రమాదకర పరిస్థితిలో అత్యంత సమయస్ఫూర్తితో వ్యవహరించి వీరోచితంగా పోరాడిన కెప్టెన్ స్మిత్‌ను దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హందాన్ బిన్ మహమ్మద్ స్వయంగా పరామర్శించారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కెప్టెన్ స్మిత్‌ వద్దకు వెళ్లిన ప్రిన్స్ హందాన్.. ఆయనతో ఆప్యాయంగా చేయి కలిపి, నుదుటిపై ముద్దు పెట్టి తన గౌరవాన్ని చాటుకున్నారు. విపత్కర సమయంలో ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రయాణికులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన తీరును కొనియాడారు.

ఈ సందర్భంగా ప్రిన్స్ హందాన్ సోషల్ మీడియా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. “కెప్టెన్ స్మిత్ మా ఫ్లైదుబాయ్ బృందంలో, అలాగే మా దేశ చరిత్రలో భాగమైనందుకు మేము ఎంతగానో గర్విస్తున్నాం. సమయస్ఫూర్తితో ప్రాణాలు కాపాడిన ఆయనకు దేశం తరఫున ప్రత్యేక అభినందనలు” అని పేర్కొన్నారు. దుబాయ్ రాజకుమారుడు చూపిన ఈ ఆప్యాయత, గౌరవం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.