LB NAGAR: ప్రమాదకరంగా సిరీస్ రోడ్డు డివైడర్ !

తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్
మినిట్ 2 మినిట్, ఎల్బీనగర్ (ఆగస్ట్ 08): ఎల్బీ నగర్ పరిధిలోని సిరీస్ రోడ్డులోని డివైడర్ ప్రమాదకరంగా మారింది. డివైడర్ సరిగ్గా లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో వెలుతురు లేక డివైడర్ రాళ్లను గమనించక వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. తాజాగా గురువారం ఓ కారు ఢీ కొనప్పటి దృశ్యం ఇది. ఇప్పటికే ఈ ప్రాంతంలో పలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయని స్థానికులు, వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తక్షణమే ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసి ముప్పు తప్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.