‘ప్రేమనే ఊరిలో’ .. ఆకట్టుకుంటున్న గ్రామీణ ప్రేమకథ!
మినిట్ 2 మినిట్ , మూవీ న్యూస్ : మనోజ్ కుమార్ దర్శకత్వంలో మహారత్న ప్రొడక్షన్స్, ఎస్కే పిక్చర్స్, వెనిల్లా ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి, మమత దేవేంద్ర ఎమ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమనే ఊరిలో’. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ టీజర్ మరియు ప్రధాన పాత్రల పరిచయ వీడియోను మేకర్స్ విడుదల చేయగా, అది విశేషంగా ఆకట్టుకుంటోంది. ఒక సున్నితమైన, హృదయజ్ఞమైన గ్రామీణ ప్రేమకథగా రూపొందుతున్న ఈ సినిమాలో శ్రీరామ్ ‘సంతు’ పాత్రలో, రంగాయణ రఘు ‘నాగన్న’ పాత్రలో, తపస్విని పూణచ్ఛ ‘రుక్మిణి’గా, అలాగే రామిక శివు ‘వసంత’ పాత్రల్లో నటిస్తూ అలరించనున్నారు. సునాద్ గౌతమ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రాజ్ కాంత్ ఎస్కే ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వహించారు. గ్రామీణ వాతావరణం, ఆప్యాయతలు, అనురాగాలతో నిండిన ఈ “ల్యాండ్ ఆఫ్ లవ్” ప్రేక్షకులకు ఒక మంచి అనుభూతిని అందిస్తుందని చిత్ర బృందం నమ్మకం వ్యక్తం చేస్తుండగా, ఆదిత్య మ్యూజిక్ ద్వారా యూట్యూబ్‌లో విడుదలైన ఈ టైటిల్ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
