టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కలకలం.. కోటాలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ షూటర్ల అరెస్ట్!

Tiger Shroff

Tiger Shroff

Tiger Shroff: బాలీవుడ్ ప్రముఖ యువ నటుడు టైగర్ ష్రాఫ్‌ను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపిన సంచలన కేసులో నిందితులను రాజస్థాన్‌లోని కోటా రైల్వే స్టేషన్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడికి పాల్పడింది ప్రొఫెషనల్ షూటర్లేనని పోలీసులు వెల్లడించారు.

పట్టుబడిన ముగ్గురు నిందితుల్లో ఇద్దరు హర్యానాకు చెందినవారు కాగా, మరొకరు బీహార్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. వీరికి గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

ముంబై నుంచి రాజస్థాన్ వరకు సినిమా స్టైల్ పారిపోయిన నిందితులు – పోలీసుల అప్రమత్తత:
ప్రతి ఆదివారం జుహు ఫుట్‌బాల్ గ్రౌండ్‌కి వెళ్లే టైగర్ ష్రాఫ్ దినచర్యను ముందే గమనించిన దుండగులు.. ఆయన ప్రాక్టీస్ ముగించుకుని కారులో ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ కాల్పులకు పాల్పడ్డారు. దాడి అనంతరం అంధేరి వెస్ట్ రైల్వే స్టేషన్ వద్ద బైక్‌ను వదిలేసి, బోరివలి వైపు వెళ్లే రైలెక్కి మహారాష్ట్ర సరిహద్దు దాటారు.

అక్కడి నుంచి గుజరాత్ మీదుగా రాజస్థాన్‌లోని కోటాకు రైలులో ప్రయాణిస్తున్న సమయంలో కోటా రైల్వే స్టేషన్‌లో నిఘా పెట్టిన పోలీసులు వారిని పట్టుకున్నారు. నిందితుల నుంచి పూర్తి వివరాలను రాబట్టేందుకు ముంబై మరియు రాజస్థాన్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు ముమ్మరం చేశారు.