Tirupati Politics: తిరుపతి నగర డిప్యూటీ మేయర్ పదవికి సంబంధించి రాజకీయ వర్గాల్లో చర్చ ఆసక్తికరంగా మారింది. ఈ పదవికి బీసీ మహిళా నాయకురాలు తిరుత్తణి శైలజ వేణుగోపాల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆమెకు ఈసారి అవకాశం దక్కవచ్చనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
ఉన్నత విద్యావంతురాలిగా, సామాన్య కుటుంబ నేపథ్యం నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శైలజ వేణుగోపాల్‌కు రాజకీయ అనుభవం కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. రెండుసార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి కార్పొరేటర్‌గా విజయం సాధించడం ఆమెకు ప్రజల్లో ఉన్న ఆదరణకు నిదర్శనంగా నిలుస్తోంది.
అంతేకాకుండా, వివాదాలకు దూరంగా ఉండే కుటుంబ నేపథ్యం కూడా ఆమెకు సానుకూల అంశంగా మారిందని అనుచరులు భావిస్తున్నారు. ఆమె భర్త సైతం రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ టీవీ చర్చలు, విశ్లేషణల ద్వారా పార్టీ వాణిని బలంగా వినిపిస్తున్నారు. ఇది రాజకీయంగా అదనపు బలంగా నిలుస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ముఖ్యంగా తిరుపతిలోని బీసీ నాయకుల మద్దతుతో పాటు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అండదండలు కూడా ఆమెకు కలిసొచ్చే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
విద్యార్హత, రాజకీయ అనుభవం, బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడం, రెండుసార్లు కార్పొరేటర్‌గా గెలిచిన అనుభవం వంటి అంశాలు శైలజ వేణుగోపాల్ అభ్యర్థిత్వానికి బలాన్నిస్తున్నాయి.
మొత్తంగా తిరుపతి డిప్యూటీ మేయర్ ఎంపిక వ్యవహారంలో తిరుత్తణి శైలజ వేణుగోపాల్ పేరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే, తుది నిర్ణయం పార్టీ అధిష్ఠానం చేతుల్లోనే ఉండటంతో ఎవరికి అవకాశం దక్కుతుందన్న ఉత్కంఠ నెలకొంది.
