“డేవిడ్ రెడ్డి” నుంచి రమ్యకృష్ణ ఫెరోషియస్ పోస్టర్ విడుదల

David Reddy

David Reddy

David Reddy: ‘రా కింగ్’ మంచు మనోజ్ కథానాయకుడిగా దర్శకుడు హనుమ రెడ్డి యక్కంటి తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “డేవిడ్ రెడ్డి”. బ్రిటీష్ కాలం నాటి బ్యాక్ డ్రాప్‌తో ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో సీనియర్ నటి రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఆమె పుట్టినరోజు సందర్భంగా శనివారం చిత్రబృందం ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సినిమాలో రమ్యకృష్ణ ‘కమల రెడ్డి’ అనే పాత్రలో కనిపించనున్నారు. చేతిలో ఖడ్గంతో శత్రువులను తుదముట్టించి ఆసనంపై కూర్చున్న ఆమె లుక్ ఎంతో గంభీరంగా, భయంకరంగా ఉంది. రమ్యకృష్ణ కెరీర్‌లోనే ఈ కమల రెడ్డి పాత్ర ఒక ఐకానిక్ క్యారెక్టర్‌గా నిలిచిపోతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేశారు.

వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్, ట్రూ రాడిక్స్ బ్యానర్లపై వెంకట్ రెడ్డి, భరత్ మోటుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో మారియా ర్యబోషప్క హీరోయిన్‌గా నటిస్తోంది. ఆర్. పార్తీబన్, కాంచన తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సిద్ధమవుతోంది.