Ganesh Navratri: కొత్తపల్లి గ్రామంలో వినాయక నవరాత్రి వేడుకలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రెండవ రోజు ప్రిన్స్ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో గణనాథుడికి ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరికుప్పల జంగయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో యూత్ సభ్యులు, గ్రామ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా గణపతికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులు భక్తిశ్రద్ధలతో నైవేద్యాలు సమర్పించారు. గణనాథుని ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమం లో వరి కుప్పల రాజు,రామ కృష్ణ, నందు, వెంకటేష్, మహేష్,రాజు, కరుణాకర్, రమేష్, అశోక్, విష్ణు తదితరులు పాల్గొన్నారు..
