Haiku: హైకూ మూవీ డబ్బింగ్ పనులు ప్రారంభం!

haiku movie dubbing start

యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్స్ ఏగన్, శ్రీదేవి, ఫెమినా జార్జ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం #Haiku (హైకూ). ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు ఇప్పటికే విజయవంతంగా పూర్తి కాగా, తాజాగా చెన్నైలో సాంప్రదాయ పూజా కార్యక్రమాలతో చిత్ర బృందం డబ్బింగ్ పనులను ప్రారంభించింది. ఈ చిత్రానికి యువరాజ్ చిన్నసామి కథ, దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తుండగా, సిద్ధు కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రియేష్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ (#Netflix) సంస్థ ఈ చిత్రానికి ఓటీటీ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. అరుళ్ రిచ్, మాథ్యూ సహా పలువురు నిర్మాతలు ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ త్వరలోనే విడుదల కానున్నాయి.