మహానటుడు ఎస్.వి. రంగారావు (SVR) అభినయ ప్రతిభకు సరిహద్దులు లేవని నిరూపించే ఒక అపురూపమైన చరిత్రాత్మక ఫోటో ఇది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 1956లో నాటి చైనా ప్రధాని ‘చౌ ఎన్ లై’ భారతదేశ పర్యటనకు వచ్చిన సందర్భంలో.. పౌరాణిక గెటప్‌లో ఉన్న విశ్వనట చక్రవర్తి ఎస్వీఆర్‌ను స్వయంగా కలిసి, కరచాలనం చేస్తూ అభినందించడం ఈ చిత్రంలో చూడవచ్చు. సతీ సావిత్రి షూటింగ్ సందర్భంగా ఇది చోటుచేసుకుంది. తెలుగు సినిమా వైభవాన్ని, ఎస్వీఆర్ కీర్తి ప్రతిష్టలను చాటిచెప్పే ఈ అరుదైన దృశ్యం సినీ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. నాటి కాలంలోనే మన తెలుగు నటుల నటనకు అంతర్జాతీయ స్థాయి నేతలు సైతం ముగ్ధులయ్యేవారని ఈ అపురూప చిత్రం ద్వారా మరోసారి స్పష్టమవుతోంది.
SVR: ఎస్వీఆర్ నటనకు చైనా ప్రధాని ఫిదా.. అరుదైన చిత్రమిదే!
