Bhagavad Gita: పూజా గదిలోనే భగవద్గీత.. మరి ధర్మాచరణ ఎక్కడ?

bhagavad-gita-teachings-for-life-and-spiritual-awakening

ఇలా కళ్ళు మూసి అలా తెరిచేసరికి కాలచక్రం గిర్రున తిరిగిపోతోంది. ప్రతి క్షణం చరిత్రగా మారుతోంది. కళ్లముందు ఉన్నవారు కాలగర్భంలో కలిసిపోతుంటే, ఏదో ఒకరోజు మన వంతు కూడా వస్తుందని తెలుసు. కానీ, ఆ నిజాన్ని అంగీకరిస్తూ జీవిత చరమాంకాన్ని పండుగలా మార్చుకోవడానికి మాత్రం సిద్ధపడం. కేవలం ధర్మ వచనాలు వల్లించడానికో, పవిత్ర గ్రంథాలను ఇంట్లో భద్రపరుచుకోవడానికో పరిమితమవుతాం.

భగవద్గీతను కేవలం పూజా మందిరానికే పరిమితం చేస్తే శుభం కలుగుతుందా? అలాగైతే ఆ పుస్తకాన్ని అంటిపెట్టుకుని ఉండే చెదపురుగులే మనకంటే ఎక్కువ జ్ఞానవంతులు అనుకోవాలి. భగవద్గీత కేవలం చదవడానికి కాదు.. బతుకు విలువను తెలుసుకోవడానికి. నైరాశ్యంలో ఉన్నవారికి ధైర్యం చెప్పి, విజయ తీరాలకు చేర్చే అమృత గుళిక అది. సర్వ ధర్మాల, ఉపనిషత్తుల సారం ఈ గీత. భగవంతుడే స్వయంగా గానం చేసిన ఈ గీతామృతాన్ని ఆస్వాదిస్తే పునర్జన్మ ఉండదని వ్యాస భగవానుడు చెప్పారు.

ఇకనైనా కాసేపు మొబైల్ పక్కనపెట్టి, చేతిలోకి భగవద్గీతను తీసుకోండి. అందులోని జ్ఞానాన్ని ఆచరణలో పెట్టండి. మీ తలరాత మారడం నిశ్చయం. ఇది గీతాచార్యుడి అభయం.. తిరుగులేని సుదర్శన చక్రం, పాశుపతాస్త్రం!

ఆదూరి వేంకటేశ్వర రావు
+91 98664 93074