రానా ‘స్పిరిట్ మీడియా’ చేతుల్లోకి ‘అమీర్ లోగ్’

rana-daggubati-spirit-media-to-release-ameer-log-movie

అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ ఎల్ఎల్‌పి బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మాణంలో, రమణా రెడ్డి సోమ దర్శకత్వంలో తెరకెక్కిన ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అమీర్ లోగ్’. ఎంసీ హరి, మనోజ్, శశిధర్ హీరోలుగా నటించిన ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, రాహుల్ సిప్లిగంజ్ పాడిన ‘అవ్వల్ దావత్’ సాంగ్ ఇప్పటికే యూత్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి.

తాజాగా ఈ క్రేజీ మూవీ డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రముఖ నటుడు రానా దగ్గుబాటికి చెందిన ‘స్పిరిట్ మీడియా’ సొంతం చేసుకుంది. సినిమాలోని కంటెంట్ నచ్చడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేసేందుకు స్పిరిట్ మీడియా ముందుకు వచ్చింది. హైదరాబాద్ గల్లీ బ్యాక్‌డ్రాప్‌లో ముగ్గురు స్నేహితుల చుట్టూ తిరిగే కథతో, యూత్‌కి మంచి సందేశాన్ని ఇచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందించారు. స్మరణ్ సాయి సంగీతం అందించిన ఈ చిత్రానికి ఎస్‌వీకే ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు. త్వరలోనే ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించనున్నారు.