బూడిదవుతున్న ప్రాణాలు.. కోట్లు కూడబెడుతున్న రాక్షసులు!

Chemical Blast

Chemical Blast

Chemical Blast: ఒక రియాక్టర్ పేలిందంటే ఆ కంపెనీకి జరిగే నష్టం కోట్లలో లెక్కగట్టవచ్చు. యంత్రాలు కాలిపోతే కొత్తవి కొనుగోలు చేయొచ్చు. కానీ, ఆ బూడిదలో రక్తం చిందించి ప్రాణాలు వదిలిన పేద కార్మికుల కుటుంబాల రోదనకు ఈ లోకం ఎంతకు వెల కట్టగలదు? మనుషుల ప్రాణాలంటే ఆ కంపెనీ యాజమాన్యాలకు అంత చులకనా?

అసలు ఆ ప్రమాదాల్లో ఎంతమంది అమాయకులు బలయ్యారు? బతుకుదెరువు కోసం వేరే రాష్ట్రాల నుంచి పొట్టచేతపట్టుకుని వచ్చిన వలస కార్మికులు ఎంతమంది? ప్రాణాలు కోల్పోయిన ఆ నిరుపేదల మృతదేహాలను కూడా బంధువులకు దక్కకుండా ఎక్కడో రహస్యంగా బొందపెట్టిన ఆ కిరాతకులు ఎవరు? గేట్లకు తాళాలు వేసి, అర్ధరాత్రి అంబులెన్సుల్లో తరలించి, సాక్ష్యాలను మాయం చేసిన ఆ చీకటి దందాల వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? రాష్ట్రాల సరిహద్దులు దాటిపోతున్న ఈ దారుణాల గుట్టు రట్టయ్యేదెన్నడు?

ఈ అక్రమ సామ్రాజ్యాన్ని కాపాడటానికి తెరవెనుక ఎంతమంది రాజకీయ నాయకులు కాపలా కాస్తున్నారు? కంపెనీల నుంచి వస్తున్న కోట్ల రూపాయల ముడుపులు ఎవరి జేబులను నింపుతున్నాయి? మానవత్వానికి ఇక్కడ విలువేలేదా? కేవలం పైసల కోసం మనుషుల ప్రాణాలను కూడా బలిపెట్టే ఈ రాక్షస క్రీడ ఎన్నాళ్లు సాగుతుంది?

అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతూ, ప్రశ్నించే గొంతులను నొక్కుతున్న ఈ ఫార్మా మాఫియా అరాచకాలను నిలదీసే సమయం ఆసన్నమైంది. ఇది ఒక్క కంపెనీ కథ మాత్రమే కాదు… ఇలాంటి అనేక పరిశ్రమల వెనుక దాగి ఉన్న భయానక నిజాలను బట్టబయలు చేసే మరో సంచలన కథనం త్వరలో మీ ముందుకు రానుంది!

“ప్రాణాలకు వెల ఎంత? – త్వరలో మరిన్ని నిజాలతో పార్ట్ – 4 ముందుకు…”