ఏపీలో తీరం దాటనున్న తీవ్ర తుపాను.. తెలంగాణలో కుండపోత వర్షాలు!

Severe Cyclone

Severe Cyclone

Severe Cyclone: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుపానుగా మారుతోంది. ఇది క్రమంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం దిశగా పయనిస్తూ ఆగ్నేయ, వాయువ్య దిశలో బలాన్ని పుంజుకుంటోంది. అక్టోబర్ 28న మధ్యాహ్నానికి బాపట్ల, విశాఖపట్నం మధ్య ఏపీ-యాణం తీరాన్ని దాటే సూచనలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD) తెలిపింది. తీరం దాటే సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్లు, గరిష్టంగా 140 కిలోమీటర్ల వేగంతో సుడిగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

ఈ తుపాను ప్రభావంతో అక్టోబర్ 29న తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ముఖ్యంగా తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్ష తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో వర్షాలు కురిసే ప్రమాదం ఉండటంతో హెచ్చరికగా ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది.

అదేవిధంగా కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని తెలుపుతూ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. తుపాను ముప్పు దృష్ట్యా ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.