పట్టించుకోని ‘సూర్య నమస్కార్’.. అధికారులు నీరసించారా, నిద్రపోతున్నారా?

Surya Namaskar

Surya Namaskar

Surya Namaskar: ఎల్బీనగర్‌లోని కామినేని ఫ్లై ఓవర్ కింద ఎంతో వ్యయంతో, చూడముచ్చటగా నిర్మించిన ‘సూర్య నమస్కార్ సర్కిల్’ అధికారుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. ఎంతో అందంగా రూపుదిద్దుకున్న ఈ జంక్షన్ బ్యూటిఫికేషన్ పనులు పూర్తయి సుదీర్ఘ కాలం గడుస్తున్నా ఇప్పటివరకు ప్రారంభానికి నోచుకోకపోవడం స్థానికులను, వాహనదారులను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.

గతంలో సమీపంలోని ఆక్సిజన్ పార్క్ గేట్లను అరకొరగా తెరిచి మున్సిపల్ యంత్రాంగం చేతులు దులుపుకుంది. అదే తీరులో ఇప్పుడు అత్యంత సుందరంగా ఏర్పాటు చేసిన సూర్య నమస్కార్ విగ్రహాలు, వాటర్ ఫౌంటేన్ సర్కిల్‌ను సైతం పట్టించుకోకుండా వదిలేసింది. పర్యవేక్షణ లోపించడంతో, కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ఈ ప్రాంగణం భిక్షాటన చేసే వారికి, అనాథలకు నివాస స్థలంగా మారిపోయింది. ఫౌంటేన్ పరిసరాల్లో చెత్తాచెదారం పేరుకుపోయి ప్రాజెక్టు ఉద్దేశమే దెబ్బతింటోంది.

సుందరీకరణ పనులు వేగంగా జరుగుతున్నా, వాటి నిర్వహణ, ప్రారంభోత్సవాల్లో మున్సిపల్ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా ఎల్బీనగర్ మున్సిపల్ ఉన్నతాధికారులు స్పందించి, సూర్య నమస్కార్ సర్కిల్‌ను తక్షణమే ప్రారంభించి అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.అధికారుల అలసత్వంతో వృథాగా ప్రజాధనం!

కామినేని ఫ్లై ఓవర్ కింద అందంగా తీర్చిదిద్దిన సూర్యనమస్కార్ సర్కిల్
భిక్షాటన చేసే వారికి ఆవాసంగా మారిన వాటర్ ఫౌంటేన్

మినిట్ 2 మినిట్, ఎల్బీనగర్(అక్టోబర్ 25):  ఎల్బీనగర్‌లోని కామినేని ఫ్లై ఓవర్ కింద ఎంతో వ్యయంతో, చూడముచ్చటగా నిర్మించిన ‘సూర్య నమస్కార్ సర్కిల్’ అధికారుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. ఎంతో అందంగా రూపుదిద్దుకున్న ఈ జంక్షన్ బ్యూటిఫికేషన్ పనులు పూర్తయి సుదీర్ఘ కాలం గడుస్తున్నా ఇప్పటివరకు ప్రారంభానికి నోచుకోకపోవడం స్థానికులను, వాహనదారులను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.

గతంలో సమీపంలోని ఆక్సిజన్ పార్క్ గేట్లను అరకొరగా తెరిచి మున్సిపల్ యంత్రాంగం చేతులు దులుపుకుంది. అదే తీరులో ఇప్పుడు అత్యంత సుందరంగా ఏర్పాటు చేసిన సూర్య నమస్కార్ విగ్రహాలు, వాటర్ ఫౌంటేన్ సర్కిల్‌ను సైతం పట్టించుకోకుండా వదిలేసింది. పర్యవేక్షణ లోపించడంతో, కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ఈ ప్రాంగణం భిక్షాటన చేసే వారికి, అనాథలకు నివాస స్థలంగా మారిపోయింది. ఫౌంటేన్ పరిసరాల్లో చెత్తాచెదారం పేరుకుపోయి ప్రాజెక్టు ఉద్దేశమే దెబ్బతింటోంది.

సుందరీకరణ పనులు వేగంగా జరుగుతున్నా, వాటి నిర్వహణ, ప్రారంభోత్సవాల్లో మున్సిపల్ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా ఎల్బీనగర్ మున్సిపల్ ఉన్నతాధికారులు స్పందించి, సూర్య నమస్కార్ సర్కిల్‌ను తక్షణమే ప్రారంభించి అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.