Kavitha drone: హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత నివాసం వద్ద సాయంత్రం తీవ్ర కలకలం రేగింది. కవిత నివాస ప్రాంగణంపై గుర్తుతెలియని వ్యక్తులు డ్రోన్ ఎగురవేయడం స్థానికంగా సంచలనం సృష్టించింది. హఠాత్తుగా నివాసంపై డ్రోన్ ప్రత్యక్షమవ్వడంతో పార్టీ శ్రేణులు, కవిత మద్దతుదారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ భద్రతా లోపంపై కవిత కార్యాలయ సిబ్బంది తక్షణమే స్పందించి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నివాసంపై డ్రోన్ ఎగురవేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తూ డ్రోన్ ఎక్కడి రప్పించారనే దానిపై దర్యాప్తు వేగవంతం చేశారు. ఉన్నతాధికారులు సైతం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి విచారణ జరుపుతున్నారు.
