మినిట్ 2 మినిట్ , సోషల్ మీడియా : అక్క ఆప్యాయంగా కట్టిన ఆ చిన్న రక్షాబంధనం, తమ్ముడి చేతిపై అందమైన అనుబంధమై మెరిసింది. పట్టుదారాల కన్నా మిన్నగా, అక్క కళ్లలోని మమకారం ఆ చిన్ని గుండెకు రక్షణగా నిలిచింది. నుదుటిన ఎర్రటి బొట్టు, ముఖంలో వెలిగిపోయే నిండైన చిరునవ్వుతో ఆ బుజ్జి సోదరి రాఖీ కడుతుంటే, అమాయకంగా చూస్తున్న తమ్ముడి చూపులు ఆ క్షణానికి మరింత అందాన్ని తెచ్చాయి. చిన్ననాటి ఈ మధురజ్ఞాపకం, భవిష్యత్తులో వీరిద్దరి నడుమ నిలిచే తీపి గురుతు! ఎలాంటి కపటం లేని పసి మనసుల ఆనందానికి నిజంగానే అవధులు లేవు. రాఖీ పండుగ ఇచ్చే అసలైన సందేశం, ఈ ఆప్యాయతా అనురాగాలే!
ఫోటో: వి. ప్రకాశ్ శర్మ, మినిట్ 2 మినిట్ ప్రతినిధి
