పిట్టంపల్లి పోరుబాట.. కాలుష్య రాక్షసిపై స్వరం విప్పుదాం!

Pittampally pollution

Pittampally pollution

Pittampally pollution: దశాబ్దాలుగా మనల్ని కబలిస్తున్న ఈ కాలుష్య రాక్షసిపై ఇకనైనా గళం విప్పకపోతే మన మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? మనల్ని, మన భూములను, మన ప్రాణాలను హరిస్తున్న ఈ కంపెనీలపై మనం తప్పకుండా పోరుబాట పట్టాల్సిందే. ఈ కాలుష్య కాసారాలపై ఇకనైనా ఉడుంపట్టు పట్టాల్సిందే. రేపటి మన పిల్లల భవిష్యత్తు కోసం, పచ్చని నేల కోసం అందరం కలిసి నడుంకట్టాల్సిన సమయం వచ్చేసింది.

వెలిమినేడు, పిట్టంపల్లి గ్రామాల ప్రజల సంక్షేమం కోసమే నా ఈ తపత్రయం అంతా. ఏళ్లుగా కళ్లెదుటే సాగుతున్న ఆ పచ్చని ప్రకృతి వినాశనాన్ని చూసి ఆపలేక నా గుండె చెరువవుతోంది. జనం సాక్షిగా చెబుతున్నా.. ఇది మీకోసం, మన ఊరి కోసం నేను చేస్తున్న ఉద్యమం. ఇన్నాళ్లు పడిన నరకయాతన చాలు. ఇకనైనా మౌనం వీడదాం.
కంపెనీల గుట్టుమట్లు రట్టయ్యే వరకు, మన గాలిని, నీటిని కలుషితం చేస్తున్న వారిని ప్రశ్నించే వరకు మనం విశ్రమించకూడదు. తరాల తరబడి మనం బతికిన ఈ నేలను కాపాడుకోవడానికి అందరం కలిసికట్టుగా సాగుదాం. రేపటి మన భావితరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన పిట్టంపల్లిని కానుకగా అందిద్దాం. రండి, ఈ పోరులో మీ గొంతు కలపండి..