మూడు జోన్లుగా తెలంగాణ విభజన.. 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీయే ప్రభుత్వ ధ్యేయమన్న ముఖ్యమంత్రి

Telangana Rising

Telangana Rising

Telangana Rising: 2047 నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ వేదికగా ఓ ప్రముఖ జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన ‘సదరన్ రైజింగ్ సమ్మిట్ 2026’లో ఆయన పాల్గొని ప్రసంగించారు.

‘తెలంగాణ రైజింగ్’ విజన్‌తో ముందుకు:

దేశాభివృద్ధిలో దక్షిణాది రాష్ట్రాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయని సీఎం తెలిపారు. ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యానికి అనుగుణంగా భారతదేశం 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగే క్రమంలో, అందులో 3 ట్రిలియన్ డాలర్ల వాటా తెలంగాణ నుంచే ఉండాలనే ‘తెలంగాణ రైజింగ్’ విజన్‌తో ముందుకు సాగుతున్నట్లు వివరించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం తెలంగాణను మూడు జోన్లుగా విభజించి ప్రణాళికలు అమలు చేస్తున్నామని చెప్పారు.

సంక్షేమ పథకాల అమలులో అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరగాలన్నదే తమ ఉద్దేశమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో పెరుగుతున్న నిరంకుశ ధోరణులను ఎదుర్కోవడానికి రాహుల్ గాంధీ నాయకత్వం అవసరమని, అబద్ధాలను ప్రచారం చేస్తున్న బీజేపీ ‘వాట్సాప్ యూనివర్సిటీ’ ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.