Gurupurnima: కొత్తపల్లిలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు

Gurupurnima celebrations and Bhagavad Gita recitation in Kothapally Yacharam

మినిట్ 2 మినిట్ న్యూస్ డెస్క్, యాచారం: మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో గురుపౌర్ణమి వేడుకలు బుధవారం అత్యంత వైభవంగా జరిగాయి. గ్రామంలోని ధర్మశాలలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి బ్రహ్మశ్రీ భార్గవ గురుస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ వేడుకల్లో భక్తులు విశేషంగా పాల్గొని శ్రీమద్భగవద్గీత పారాయణం చేశారు. ఈ సందర్భంగా భార్గవ గురుస్వామి మాట్లాడుతూ.. మానవ జీవితంలో గురుభక్తి, సనాతన ధర్మం, భగవద్గీత బోధనలు ఎంతో కీలకమైనవని ప్రవచించారు. కార్యక్రమం అనంతరం భక్తులకు మహా ప్రసాద వితరణ చేపట్టారు. ఈ వేడుకల్లో గ్రామ పెద్దలు సోమ రంగయ్య, సోమ సత్యనారాయణ, కుందారం లోహిత్ రెడ్డి, సుమతమ్మ, లక్ష్మి, రవిలతో పాటు అధిక సంఖ్యలో మహిళలు, యువకులు, గ్రామస్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.