కొత్తగా పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికి ముఖ్య గమనిక. జులై 1 నుంచి పాస్‌పోర్ట్ సర్వీస్ ఛార్జీలు భారీగా పెరగనున్నాయి. పెరిగిన ధరల భారం మీపై పడకుండా ఉండాలంటే.. ఇవాళ, రేపు (జూన్ 30) మాత్రమే పాత ధరలతో అప్లై చేసుకునే సువర్ణావకాశం ఉంది.
కొత్త, పాత ఛార్జీల వివరాలు:
| కేటగిరీ | పాత ధర (రేపటి వరకు) | కొత్త ధర (జులై 1 నుంచి) |
| నార్మల్ పాస్‌పోర్ట్ | ₹1,500 | ₹2,500 |
| తత్కాల్ పాస్‌పోర్ట్ | ₹3,500 | ₹5,000 |
ముఖ్య గమనిక: జులై 1 నుంచి నార్మల్ కేటగిరీపై ₹1,000, అలాగే అర్జెంట్‌గా పొందే తత్కాల్ కేటగిరీపై ఏకంగా ₹1,500 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
డబ్బులు ఆదా చేసుకోండిలా..
మీకు పాస్‌పోర్ట్ అవసరం ఉంటే, వెంటనే అధికారిక ‘Passport Seva’ వెబ్సైట్ లేదా యాప్ ద్వారా లాగిన్ అయ్యి ఫీజు చెల్లించండి. రేపటి లోగా ఆన్లైన్ అప్లికేషన్ పూర్తి చేసి పేమెంట్ సక్సెస్ అయితే పాత ధరల ప్రయోజనం లభిస్తుంది. మీ అపాయింట్మెంట్ స్లాట్ జులై 1 తర్వాత ఉన్నా ఇబ్బంది లేదు, కానీ రుసుము మాత్రం రేపటి లోపే చెల్లించాల్సి ఉంటుంది. మరికొద్ది గంటలు మాత్రమే సమయం ఉన్నందున, వెంటనే అప్లై చేసి మీ డబ్బును ఆదా చేసుకోండి!
