Organ donation: ఆదర్శమూర్తి మాధవరావు.. మరణించినా ఐదుగురికి పునర్జన్మ!

organ-donation-madhava-rao

ఎల్బీనగర్, హైదరాబాద్:
ఎల్బీనగర్ శ్రీనివాస కాలనీ (సిరీస్ రోడ్డు) నివాసి అయిన మాధవరావు (72) మరణంలోనూ ఐదుగురికి పునర్జన్మను ప్రసాదించి సమాజానికి ఆదర్శంగా నిలిచారు. జూన్ 26న ఆయన వాకింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కిందపడిపోగా, కుటుంబ సభ్యులు వెంటనే ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయనను పరీక్షించిన వైద్యులు ‘బ్రెయిన్ డెడ్’ అయినట్లు నిర్ధారించారు.

తీరని శోకంలో ఉన్నప్పటికీ, మాధవరావు కుటుంబ సభ్యులు మానవత్వంతో అవయవదానానికి అంగీకరించారు. వారి అంగీకారంతో తెలంగాణ రాష్ట్ర అవయవ, కణజాల మార్పిడి సంస్థ (జీవన్‌దాన్) వైద్య బృందం ఆయన శరీరం నుంచి రెండు కిడ్నీలు, కాలేయాన్ని సేకరించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు శస్త్రచికిత్స ద్వారా అమర్చారు. అలాగే రెండు కంటి కార్నియాలను కూడా సేకరించి చూపు లేని వారికి అమర్చినట్లు నోడల్ అధికారి ప్రొఫెసర్ శ్రీభూషణ్ రాజు పేర్కొన్నారు. మరణానంతరం ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపిన మాధవరావు కుటుంబ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. పరోపకారం తన తండ్రి నిత్యం ఆచరించిన మంత్రమని, అదే నేడు అవయవదానానికి స్ఫూర్తి అని మాధవరావు తనయుడు మహేశ్ తెలిపారు.