మేడిగడ్డ టూర్ ఒక ‘జాలీ ట్రిప్’.. ఎల్ నినోపై ప్రతిపక్షాలది చిల్లర రాజకీయం.. దానం నాగేందర్ ఫైర్!

Danam Nagender

Danam Nagender

Danam Nagender: బీఆర్‌ఎస్ నాయకులు ఇటీవల చేపట్టిన మేడిగడ్డ పర్యటన ఒక ‘జాలీ ట్రిప్’ మాత్రమేనని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్రంగా ఆరోపించారు. వాతావరణంలో ఏర్పడుతున్న ఎల్ నినో ప్రభావంపై ప్రతిపక్ష నాయకులు కావాలనే అనవసర రాజకీయం చేస్తున్నారని ఆయన ఘాటుగా విమర్శించారు.

హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారని దానం నాగేందర్ స్పష్టం చేశారు. 2027 జనవరి నాటికి హైదరాబాద్ మహానగరానికి అదనంగా మరో ఐదు టీఎంసీల నీరు అవసరమవుతుందని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు చిల్లర రాజకీయం చేయడం మానుకుని, నగర ప్రజల తాగునీటి అవసరాల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సహకరించాలని ఆయన కోరారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలే పరమావధిగా పనిచేస్తోందని, మేడిగడ్డ సందర్శన పేరిట బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. నగర ప్రజలకు తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.