సంప్రదాయాల సింగారంలో ఆడపడుచులు.. ఆకాశమంత బతుకమ్మ సంబరం

Bathukamma festival

Bathukamma festival

Bathukamma festival: నగరవ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఆకాశాన్నంటాయి. పూల పండుగ వేళ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతి ఇంటా నూతన శోభను తెచ్చాయి. ప్రకృతి ప్రసాదించిన తంగేడు, గునుగు, బంతి, చామంతి వంటి రంగురంగుల పూలతో ఆడపడుచులు భక్తిశ్రద్ధలతో, ఎంతో ఆకర్షణీయంగా బతుకమ్మలను పేర్చారు.

సంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలు, చిన్నారులు బతుకమ్మలను చేతుల్లో పట్టుకుని పండుగ సంతోషాన్ని పంచుకుంటూ కెమెరాకు చిరునవ్వులతో ఫోజులిచ్చారు. రంగురంగుల పూల ఘనతతో నిండిన ఈ సుందర దృశ్యం నగరంలోని ప్రతీ వీధిలోనూ పండుగ కోలాహలాన్ని చాటిచెబుతోంది.