Auto Overloading: ప్రయాణికులను చేరవేయాల్సిన పాసింజర్ ఆటోలో నిబంధనలను తుంగలో తొక్కి, ప్రమాదకర రీతిలో కర్రలను లోడ్ చేసుకుని రోడ్డుపై వెళ్తున్న దృశ్యమిది. ఆటోలో బయటకు పొడుచుకు వచ్చిన ఈ కర్రల వల్ల వెనుక వచ్చే ద్విచక్ర వాహనదారులకు, ఇతర వాహనాలకు తీవ్ర ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
కొద్దిపాటి రవాణా ఖర్చులు ఆదా చేసుకునేందుకు ఆటో డ్రైవర్లు, వ్యాపారులు ఇలా నిబంధనలు ఉల్లంఘిస్తూ తోటి ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. రద్దీగా ఉండే ప్రధాన రహదారులపై ఇలా రవాణా సాగుతున్నా సంబంధిత ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోకపోవడంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలు జరగకముందే అధికారులు స్పందించి, ఇలాంటి విచ్చలవిడి లోడింగ్ వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
