Vanamahotsavam: ఎల్బీ నగర్ నారాయణ హైస్కూల్‌లో ఘనంగా వనమహోత్సవం

Students and staff planting saplings during Vanamahotsavam at Narayana High School, LB Nagar

మినిట్2మినిట్ డెస్క్, ఎల్బీ నగర్: స్థానిక శివగంగ కాలనీలోని నారాయణ హైస్కూల్‌లో వనమహోత్సవం కార్యక్రమం సంబరంగా జరిగింది. శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని పలు రకాల మొక్కలను నాటారు. అనంతరం అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహించారు. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందంటూ ప్రిన్సిపాల్ హరిప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం హేమాంబర్, ఆర్ఐ రవిప్రసాద్, ఏవో రాధ, అకాడెమిక్ డీన్ అశోక్, వైస్ ప్రిన్సిపాల్ సంధ్య, బిందు తదితర ఉపాధ్యాయ బృందం పాల్గొంది.