Traffic challan: ఓడియమ్మ.. ఇన్ని చలాన్లు ఏంది కౌశిక్ సార్?

echallan.tspolice.gov.in website showing a detailed list of pending traffic challans for vehicle TS03FF9999 owned by Kaushik Reddy Padi, highlighting multiple violations like over speeding, dangerous driving, and irregular number plates.

మినిట్ 2 మినిట్, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి చెందిన వాహనం (TS03FF9999) పేరు మీద భారీగా పెండింగ్ చలాన్లు ఉండటం ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఓవర్ స్పీడింగ్, డేంజరస్ డ్రైవింగ్, రాంగ్ రూట్ యూ-టర్న్లు, ఫ్యాన్సీ/ఇర్రెగ్యులర్ నంబర్ ప్లేట్లు మరియు లైసెన్స్ లేకపోవడం వంటి పదుల సంఖ్యలోని ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన చలాన్ల లిస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. సామాన్య ప్రజలకు నీతులు చెప్పే బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధే ఇలా వరుసగా చట్టాలను ఉల్లంఘిస్తే ఎలా అని నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు కేవలం సామాన్యులకేనా, విఐపీలకు వర్తించవా అని ప్రశ్నిస్తూ పోలీసు అధికారులను (సైబరాబాద్ సిపి, సజ్జనార్) ట్యాగ్ చేసి సదరు వాహనంపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

Image