keeravani: ఆస్కార్ గ్రహీత కీరవాణి ఆలపించిన ‘అంతిమ కథ’

ఆస్కార్ గ్రహీత కీరవాణి ఆలపించిన ‘అంతిమ కథ’

మినిట్ 2 మినిట్ , మూవీ న్యూస్ :  ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ‘అమీర్ లాగ్’ చిత్రం నుంచి ‘అంతిమ కథ’ అనే ఆత్మను తాకే భావోద్వేగమైన లిరికల్ పాటను ప్రసిద్ధ మ్యూజిక్ లేబుల్ Awwal Audio ద్వారా విడుదల చేశారు. జీవితంలో పుట్టుక, చావు, బంధాలు మరియు కాలం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ సాగే ఈ విలక్షణమైన గీతాన్ని ఆస్కార్ పురస్కార గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకులు ఎం.ఎం. కీరవాణి గారు తన విశిష్టమైన స్వరంతో ఆలపించగా, స్మరణ్ సాయి సంగీతాన్ని సమకూర్చారు. రమణ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం నుంచి వచ్చిన ఈ మెలోడీ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లను, సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది.