ఐదు రాష్ట్రాల పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన డాన్.. ఎట్టకేలకు ఫ్యూచర్ సిటీ పోలీసుల ఉచ్చులో!

Drug Kingpin

Drug Kingpin

Drug Kingpin:  మత్తుపదార్థాల అక్రమ రవాణాపై ఫ్యూచర్ సిటీ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఐదు రాష్ట్రాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా మారిన డ్రగ్స్ కింగ్‌పిన్ అబ్దుల్ మిషాల్‌ను రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. అతనితో పాటు మరో కీలక నిందితుడు తారిఖ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. మహేశ్వరం ఎస్‌ఓటీ (SOT), ఇబ్రహీంపట్నం పోలీసులు అత్యంత చాకచక్యంగా నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో కేరళ రాష్ట్రానికి చెందిన ఈ ఇద్దరు డ్రగ్స్ పెడ్లర్లు పట్టుబడ్డారు.

పలు రాష్ట్రాల్లో మత్తుపదార్థాల సరఫరా వెనుక అబ్దుల్ మిషాల్ ప్రధాన సూత్రధారిగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. వీరి అరెస్టుతో అంతర్రాష్ట్ర డ్రగ్స్ నెట్‌వర్క్‌కు సంబంధించిన కీలక రహస్యాలు, సప్లై చైన్ వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. నిందితుల నేరచరిత్ర, స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ పరిమాణం, కేసు పూర్తి వివరాలపై పోలీసులు త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేయనున్నారు.