Ibrahimpatnam: జర్నలిస్టుల సమస్యలపై నిరంతర పోరాటం

TUWJ H143 Ibrahimpatnam constituency president Suramoni Satyanarayana addressing news reporters meeting

– టీయూడబ్ల్యూజే (హెచ్-143) నియోజకవర్గ అధ్యక్షుడు సూరమోని సత్యనారాయణ
– ఇబ్రహీంపట్నంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ జర్నలిస్టుల సమావేశం

మినిట్ 2 మినిట్ డెస్క్, ఇబ్రహీంపట్నం: జర్నలిస్టుల సంక్షేమం, సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం చేస్తామని టీయూడబ్ల్యూజే (హెచ్-143) నియోజకవర్గ అధ్యక్షుడు సూరమోని సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం స్థానిక బృందావన్ కాలనీలో నియోజకవర్గ స్థాయి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, అక్రిడిటేషన్ కార్డులు, ఇన్సూరెన్స్, హెల్త్ కార్డులు ఇప్పించడంతో పాటు గృహ నిర్మాణం, జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పలు నూతన కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీయూడబ్ల్యూజే (హెచ్-143) కమిటీ అధ్యక్షుడిగా సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్, గౌరవ అధ్యక్షుడిగా శ్రీనివాస్, కోశాధికారిగా నరేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా ఆంజనేయులు, హనుమంతు, సుదర్శన్, సలహాదారుగా వెంకటేష్, సంయుక్త కార్యదర్శిగా కిషన్, కార్యనిర్వాహక కార్యదర్శులుగా బాబు, విజయ్, గోవర్ధన్, రాజు, జిల్లా కమిటీ సభ్యులుగా రామకృష్ణయాదవ్, సురేష్ యాదవ్‌లు ఎన్నికయ్యారు. అలాగే తెంచు నియోజకవర్గ అధ్యక్షుడిగా అశోక్, ప్రధాన కార్యదర్శిగా సందీప్ కుమార్, కోశాధికారిగా మహేందర్ గౌడ్, సంయుక్త కార్యదర్శిగా యాదగిరి, ఉపాధ్యక్షులుగా నగేష్, రాఘవేందర్, ప్రచార కార్యదర్శిగా భూచక్రంగౌడ్, సలహాదారుగా సంతోష్, జిల్లా కమిటీ సభ్యులుగా సురేష్ యాదవ్, రామకృష్ణయాదవ్, కార్యనిర్వాహక సభ్యులుగా మహేష్ చారి, యాదయ్య, శ్రీకాంత్ రెడ్డిలను నియమించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు హరికృష్ణారెడ్డి, మహేందర్, రాజు, సురేష్, బుగ్గరాములు, బస్వాపురం దశరథ్, గోపాల్, దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు.