మాలల మహాధర్నాను విజయవంతం చేయండి!

మినిట్ 2 మినిట్, బెజ్జంకి (ఆగస్ట్ 14): ఈ నెల 23న దుబ్బాక పట్టణ కేంద్రంలో తలపెట్టిన ‘మాలల మహాధర్నా’ను దళిత సంఘాలు, మాల సోదరులు పాల్గొని దిగ్విజయం చేయాలని తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి అంజయ్య పిలుపునిచ్చారు. బెజ్జంకి మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహ ప్రాంగణంలో నిర్వహించిన మాల సంఘాల విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు, ఎస్సీ వర్గీకరణ, రోస్టర్ పద్ధతి వల్ల మాల సామాజికవర్గానికి జరుగుతున్న తీవ్ర అన్యాయాన్ని ఎండగట్టడానికే ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. సిద్ధిపేట జిల్లా పరిధిలోని మాల నాయకులు, దుబ్బాక నియోజకవర్గ మాల కుటుంబాలు, యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చి హక్కుల సాధనకు వేదికైన ఈ మహాధర్నాను సక్సెస్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నరసయ్య, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎల శేఖర్ బాబు, దామర శంకర్, రాజ మహేందర్, మాశం బాబు, సంఘం మధు, రాకమ ఆంజనేయులు, దొంతుల రాయమల్లు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.