LB Nagar: పరేషాన్ చేస్తున్న ‘బిర్లా ఓపెన్ మైండ్స్’ ట్రాఫిక్..!

mansoorabad-sahara-road-school-traffic-jam-issue

మినిట్ 2 మినిట్ డెస్క్, ఎల్బీ నగర్: మన్సురాబాద్‌-సహారా రోడ్డులో నిత్యం ట్రాఫిక్‌ నరకం కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ మార్గంలోని బిర్లా ఓపెన్ మైండ్స్‌తో పాటు మరో స్కూల్ ఉండటంతో, విద్యార్థుల రాకపోకల సమయాల్లో పరిస్థితి మరీ దారుణంగా మారుతోంది. ఉదయం స్కూలు తెరిచే వేళ, సాయంత్రం ముగించే సమయాల్లో పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోతున్నాయి. అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రధాన రహదారిపై తాము ట్రాఫిక్‌లో చిక్కుకుపోతున్నామని వాహనదారులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర ప్రయాణాలు చేసేవారు సైతం ఈ నరకయాతన తప్పించుకోలేకపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికార యంత్రాంగం, ట్రాఫిక్ పోలీసులు స్పందించి, స్కూల్ సమయాల్లో ఇక్కడ ప్రత్యేక చర్యలు చేపట్టి ట్రాఫిక్ సమస్యను చక్కదిద్దాలని స్థానికులు కోరుతున్నారు.