హైదరాబాద్, జూన్ 30: తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా (Chief Secretary) సంజయ్ జాజు (IAS) మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఆయన పగ్గాలు చేపట్టారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సేవలందించిన కె. రామకృష్ణా రావు (IAS) ఈ రోజు (జూన్ 30) పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో 1992 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజును నియమిస్తూ ప్రభుత్వం జూన్ 26నే ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయన నేడు నూతన సీఎస్‌గా బాధ్యతలు చేపట్టారు. నూతన సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన సంజయ్ జాజుకు మరియు పదవీ విరమణ చేసిన కె. రామకృష్ణా రావుకు సచివాలయ అధికారులు, సిబ్బంది ఘనంగా వీడ్కోలు, స్వాగతాలు పలికారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, వివిధ శాఖల విభాగాధిపతులు పాల్గొని ఇద్దరు అధికారులకు పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేశారు.
Chief Secretary: తెలంగాణ నూతన సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన సంజయ్ జాజు
