నీటి వృథాపై జలమండలి ఉక్కుపాదం.. ఒక్క పిలుపుతో రూ.20 వేల జరిమానా!

Drinking Water

Drinking Water

Drinking Water:  తాగునీటిని నిర్లక్ష్యంగా వృథా చేసే వారికి జలమండలి గట్టి షాక్ ఇచ్చింది. ఫ్లోరింగ్ శుభ్రం చేసుకోవడానికి ఏకంగా తాగునీటిని వాడిన ఒక మహిళకు భారీ జరిమానా విధించి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 23లో నివసించే పూర్ణిమ అనే మహిళ తాగునీటిని ఫ్లోర్ క్లీనింగ్ కోసం వినియోగించింది. జలమండలి అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ఈ విషయం బయటపడింది. మంచి నీటిని ఇలా వృథా చేయడం తీవ్రమైన విషయంగా పరిగణించిన అధికారులు, ఆ మహిళకు ఏకంగా రూ.20 వేల ఫైన్ విధించారు.

తాగునీటిని దుర్వినియోగం చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి స్పష్టం చేశారు. నగరంలో ఎవరైనా తాగునీటిని ఇలా వృథా చేస్తున్నట్లు కనిపిస్తే పౌరులు వెంటనే జలమండలి వాట్సాప్ నంబర్ 9949930003 కు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రతి బొట్టు నీరూ విలువైనదేనని, అవసరాలకు మాత్రమే నీటిని వాడుకోవాలని సూచించారు.