LB Nagar: ఇంటింటికీ SIR ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ

AMC Director Panyala Jaipal Reddy conducting an SIR enumeration and voter awareness drive in LB Nagar

ఎల్బీనగర్: ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఓటరు కీలక పాత్ర పోషించాలని, అర్హులైన వారంతా ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలని AMC డైరెక్టర్ పన్యాల జైపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎల్బీనగర్ విలేజ్ పరిధిలోని బూత్ నంబర్లు 129, 130లలో నిర్వహించిన ప్రత్యేక ఇంటింటి ప్రచారంలో ఆయన పాల్గొని, ప్రజలకు SIR ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి ఎన్యూమరేషన్ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించారు. వివరాలను సక్రమంగా నమోదు చేసుకుని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు MD. షఫీ, SK. హుస్సేన్, MD. తాహేర్ భాయ్, MD. అస్లాంతో పాటు స్థానిక BLAలు, BLOలు, కార్యకర్తలు పాల్గొన్నారు.