Yadaiah: అజ్మల్లాపూర్ ‘యాదయ్య’ కన్నుమూత

yadaiah-ajmallapur-passes-away

అజ్మల్లాపూర్: దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా ఆలయంలో సేవలందించిన మాజీ ఉద్యోగి అలువాల యాదయ్య(60) బుధవారం తుదిశ్వాస విడిచారు. ప్రముఖులకు మాత్రమే కాకుండా, నిత్యం వేలాది మంది భక్తులకు చిరునవ్వుతో సేవలందించిన ఆయన జీవితం ఎందరికో ఆదర్శం. ఆయన పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు, కానీ బాబా గుడికి వచ్చే ప్రతి భక్తుడికి ఆయనో పరిచయస్తుడు. నల్లగొండ జిల్లా మర్రిగూడకు సమీపంలోని అజ్మల్లాపూర్ గ్రామానికి చెందిన యాదయ్య.. తన విధిని దైవకార్యంగా భావించి, ఎండనక, వాననక బాధ్యతలు నిర్వహించారు. ఆయన నిరాడంబర జీవితం ఎంతో గొప్పది. సమాజం కోసం నిశ్శబ్దంగా శ్రమించిన ఈ సాధారణ కాపలాదారుడి మృతితో ఆయన స్వగ్రామం అజ్మల్లాపూర్‌లో విషాదం అలుముకుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని గ్రామస్థులు, సాయిబాబా ఆలయ భక్తులు తెలియజేస్తున్నారు.