యాచారం మండల వార్డు మెంబర్ల ఫోరమ్ ఏకగ్రీవం!

మినిట్ 2 మినిట్, యాచారం (ఆగస్ట్14) :రంగారెడ్డి జిల్లా యాచారం మండల వార్డు మెంబర్ల ఫోరమ్ నూతన పాలకమండలిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గురువారం స్థానిక ఫంక్షన్ హాల్‌లో జిల్లా ఫోరమ్ ఇన్‌చార్జ్ గ్యార సురేష్ పర్యవేక్షణలో మండల పరిధిలోని వార్డు సభ్యులందరి సమక్షంలో ఈ ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు.

మండల ఫోరమ్ నూతన అధ్యక్షుడిగా కొత్తపల్లికి చెందిన తలారి సత్యనారాయణను ఏకగ్రీవంగా ఎన్నుకోగా, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ప్రవీణ్, ఉపాధ్యక్షులుగా యూసఫ్, జగదీశ్, సాయి కుమార్ బాధ్యతలు చేపట్టారు. ప్రధాన కార్యదర్శులుగా బొల్లంపల్లి వెంకటేష్, కాటిక శంకర్, జనరల్ సెక్రటరీలుగా వరలక్ష్మి, తులసి కుమార్, మక్కపల్లి మహేష్, మారవాని నవ్య ఎన్నికయ్యారు. అలాగే గౌరవ అధ్యక్షులుగా కొండాపురం సుష్మ, శ్రీశైలం, దశరథ, అంజయ్య, వంగూరి మనోహర్, జంగయ్యలను నియమించారు.

నూతనంగా ఎన్నికైన ప్రతినిధులకు సహచర వార్డు సభ్యులు ఘనంగా అభినందనలు తెలియజేశారు. మండలంలోని ప్రతి వార్డు సభ్యుడి సమస్యల పరిష్కారానికి, గ్రామాల్లో పౌర సదుపాయాల కల్పనకు కమిటీ సభ్యులంతా ఐక్యంగా పోరాడాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.